పరీక్షలు కూడా నిర్వహించలేరా, పల్లీబఠానీల్లా పేపర్లు అమ్ముకున్నారు , వాటాల్లో తేడాల వల్లే వెలుగులోకి : రేవంత్

Siva Kodati |  
Published : Dec 16, 2023, 05:28 PM IST
పరీక్షలు కూడా నిర్వహించలేరా, పల్లీబఠానీల్లా పేపర్లు అమ్ముకున్నారు , వాటాల్లో తేడాల వల్లే వెలుగులోకి : రేవంత్

సారాంశం

హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌కు కేసు వివరాలు దాచిపెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ , మీకు వాటాల్లో తేడా వల్లే బయటపడిందన్నారు. ప్రశ్నాపత్రాల లీక్ బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. 

హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌కు కేసు వివరాలు దాచిపెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో శనివారం చర్చ జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ..  తాను ఈడీపైనా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేశానని గుర్తుచేశారు. పల్లీ బఠానీలకు ప్రశ్నాపత్రాలు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ , లిక్కర్ విచ్చలవిడిగా వాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అధికారులు సీజ్ చేసిన పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఇకపై డ్రగ్స్ అనే పదం వినిపించొద్దని అధికారులను ఆదేశించానని ఆయన పేర్కొన్నారు.

డ్రగ్స్ కేసుపై సిట్ వేయాలని తాను డిమాండ్ చేశానని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. డ్రగ్స్ వ్యవస్ధను కూకటివేళ్లతో పెకిలించాల్సిందిపోయింది.. ఎందుకు నిర్లక్ష్యం వహించారని ఆయన నిలదీశారు. యువత, మహిళలు డ్రగ్స్ బారినపడుతున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ వాడితే కాళ్లు వణకాలన్నారు. తాము చరిత్ర తవ్వడం మొదలుపెడితే మీరు తట్టుకోలేరని సీఎం కౌంటరిచ్చారు. పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేని అసమర్ధులని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

30 లక్షల మంది నిరుద్యోగ యువకులు నష్టపోయేలా చేశారని సీఎం విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ డ్రగ్స్‌కి అడ్డాగా మారిందన్నారు. ప్రశ్నాపత్రాల లీక్ బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. జోనల్ విధానాన్ని వ్యతిరేకించినందుకు ప్రజలకు బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే పదేళ్లు తామే అధికారంలో వుంటామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు , యువత ఎడిక్ట్ అయిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ALso Read: ప్రజలు ఛీ కొట్టినా బీఆర్ఎస్‌లో మార్పేది .. ఈసారి ప్రతిపక్షంలో కూడా వుండనివ్వరు : రేవంత్ రెడ్డి

టీఎస్ న్యాబ్ అనేది పేపర్ల మీద వున్న వ్యవస్ధ అన్నారు. మీరే ప్రశ్నాపత్రాలు అమ్ముకున్నారు, మీరే గుర్తించారు, మీరే పట్టుకున్నారు.. కానీ బలైంది ఎవరు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు ఆనాడు సోనియా ఇచ్చిన హామీని ఎన్ని కష్టాలు వచ్చినా నిలబెట్టుకున్నారని ఆయన గుర్తుచేశారు. డ్రగ్స్ విషయంలో రాజకీయాలు చేస్తే సమాజం క్షమించదన్నారు.

టీఎస్ న్యాబ్ ఏర్పాటు చేసి దానిని వారే నిర్వీర్యం చేశారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. దీనిని సమూలంగా నిర్మూలించడానికి విపక్ష పార్టీలు సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ , మీకు వాటాల్లో తేడా వల్లే బయటపడిందన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ చిత్తశుద్ధిని ప్రజలు నమ్మారని.. మేం పాలకులం కాదు, సేవకులమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth Reddy Powerful Speech: కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శ్రీకారం | Asianet Telugu
దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ! | Hyderabad Old City House Theft | Thief Sleeping In House