Revanth Reddy:తెలంగాణలో డ్రగ్స్ చలామణి, వినియోగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం ఆదేశాలు జారీ చేశారు.
Revanth Reddy: ఇకపై తెలంగాణలో మాదక ద్రవ్యాలు(డ్రగ్స్) అనే పదం వినబడకూడదనీ, డగ్స్ దండాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణను మాదక ద్రవ్యాల (డ్రగ్స్) రహిత రాష్ర్టంగా మార్చాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై సోమవారం నాడు డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు. ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. డగ్ర్స్ దందాకు చెక్ పెట్టేలని, రాష్ట్రంలో గ్రే హౌండ్స్, ఆక్టోపస్ విభాగాల మాదిరిగా యాంటీ నార్కొటిక్బ్యూరోను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఇకపై ప్రతినెలా నార్కోటిక్ బ్యూరోపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. యాంటీ నార్కొటిక్ బ్యూరోకు పూర్తిస్థాయి డైరక్టర్‌ను నియమించి ఆ విభాగాన్ని బలోపేతం చేయాలని చెప్పారు.
ఈ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించబోమని, అధికారులు, సిబ్బంది స్వేచ్ఛగా పనిచేయాలని స్పష్టంచేశారు. అవసరమైన నిధులు, వనరులను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్య కార్యదర్శి ఎ. శాంతికుమారి, డిజిపి రవిగుప్తా, ఇంటెలిజెన్స్ అదనపు డిజి బి. శివధర్ రెడ్డి, సిఎంఒ కార్యదర్శి వి.శేషాద్రి, పోలీసు, ఎక్సైజ్ విభాగాలు, డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.