పోడు భూముల సమస్యలను త్వరలో పరిష్కరించబోతున్నాం: బంజారా, ఆదివాసీ భవనాలను ప్రారంభించిన కేసీఆర్

Published : Sep 17, 2022, 01:21 PM IST
పోడు భూముల సమస్యలను త్వరలో పరిష్కరించబోతున్నాం: బంజారా, ఆదివాసీ భవనాలను ప్రారంభించిన కేసీఆర్

సారాంశం

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో నిర్మించిన సేవాలాల్‌ బంజారా భవన్‌, కుమురం భీం ఆదివాసీ భవన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఇది భారతదేశ గిరిజినుల అందరికీ స్ఫూర్తి  అన్నారు.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో నిర్మించిన సేవాలాల్‌ బంజారా భవన్‌, కుమురం భీం ఆదివాసీ భవన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఇది భారతదేశ గిరిజినుల అందరికీ స్ఫూర్తి  అన్నారు. దేశవ్యాప్తంగా బంజారాలకు ఒకే స్థాయి రిజర్వేషన్లు ఉండాలని కోరారు. టీఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక ఏకీకృత వ్యవస్థ తీసుకోస్తామని చెప్పారు. ఉన్నత స్థానాల్లో ఉన్న గిరిజనులు తండాల్లో సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని సూచించారు. 

రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను త్వరలో పరిష్కరించబోతున్నామని చెప్పారు. గిరిజనుల సమస్యల కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. సాయంత్రం జరిగే సభలో అన్ని విషయాలను మాట్లాడతానని తెలిపారు. ఇక, బంజారా, ఆదివాసీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.44 కోట్లు ఖర్చు చేసింది.

అంతకుముందు పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాల వేడుక‌ల్లో కేసీఆర్ మాట్లాడుతూ.. మతతత్వ శక్తులు తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలో మతోన్మాద శక్తులు పెట్రేగిపోతున్నాయని ఆరోపించారు. స్వార్థ ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ విద్వేషపు మంటలు రగిలిస్తున్నాయని విమర్శించారు. మనుషుల మధ్య ఈరకమైన విభజన ఏ రకంగానూ సమర్ధనీయం కాదని అన్నారు. మతం చిచ్చు ఈ రకంగానే విజృంభిస్తే.. అది దేశం, రాష్ట్రం జీవికనే కబలిస్తుందన్నారు. మానవ సంబంధాలను మంటగలుపుతుందని.. జాతి జీవనాడిని కలుషితం చేస్తుందన్నారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17ను సైతం వక్రీకరించి.. వారి స్వార్ధ సంకుచిత ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు విచ్చన్నకరమైన శక్తులు పాల్పడుతున్నాయని ఆరోపించారు. 

ఆనాటి చరిత్రతో, పరిణామాలతో ఎలాంటి సంబంధం లేని ఈ అవకాశవాదులు.. చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి, మలినం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సమాజం మరోమారు బుద్దికుశలతను ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్నారు. దుష్టశక్తుల కుటిలయత్నాలను తిప్పికొట్టడ మనందరి కర్తవ్యం అని పేర్కొన్నారు. తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దని అన్నారు.  తెలంగాణ నేల శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలని ఆకాక్షించారు. జాతి నిర్మాణంలో తెలంగాణ ఉజ్వల పాత్ర పోషించాలని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Medaram Travel Guide : సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళుతున్నారా..? ఈ టూరిస్ట్ స్పాట్స్ కూడా చుట్టిరండి
Harish Rao: హ‌రీశ్‌రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారా.? ఏడున్న‌ర గంట‌ల విచార‌ణ‌లో ఏం తేలిందంటే