ఖమ్మం లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్ధిగా నామా నాగేశ్వరరావు.. కేసీఆర్ సంచలన ప్రకటన

By Siva Kodati  |  First Published Nov 1, 2023, 8:36 PM IST

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్ధిని ముందే ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ . లోక్‌సభ ఎన్నికలకు ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా.. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును ప్రకటించారు. 


వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్ధిని ముందే ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సత్తుపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా.. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును ప్రకటించారు. ప్రజలందరి ఆశీస్సులతో నామా నాగేశ్వరరావు లోక్‌సభలో అడుగుపెడతారని కేసీఆర్ ఆకాంక్షించారు. 

click me!