తెలంగాణ ఆత్మగౌరవం కాపాడేది కేవలం టీఆర్ఎస్ మాత్రమే :కేసీఆర్

By Nagaraju TFirst Published Nov 26, 2018, 6:28 PM IST
Highlights

పరకాల నియోజకవర్గంలో రైతులు ఎక్కువ. గతంలో నీటి తీరువాలను రద్దు చేసి రైతుల పెట్టుబడికి తిరిగి డబ్బులు ఇస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాల నియోజకవర్గంలో ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో తంతులా కాకుండా బాధ్యతగా ఓటు వెయ్యాలని కోరారు.

పరకాల: పరకాల నియోజకవర్గంలో రైతులు ఎక్కువ. గతంలో నీటి తీరువాలను రద్దు చేసి రైతుల పెట్టుబడికి తిరిగి డబ్బులు ఇస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాల నియోజకవర్గంలో ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో తంతులా కాకుండా బాధ్యతగా ఓటు వెయ్యాలని కోరారు. ప్రజల ముందు టీఆర్ఎస్ అభివృద్ధి కనబడుతుందని దాన్ని చూసి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. 

ఈ ఎన్నికల్లో 58 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ కూటమి ఒకవైపు, నాలుగేళ్లలో అద్భుతమైన పాలన అందించిన టీఆర్ఎస్ మరో వైపు ఉందని అభివృద్ధి ఎటువైపు ఉందో దాన్ని చూసి ఓటెయ్యాలన్నారు. 

వరంగల్ జిల్లా వాసులు మాకొద్దు అనేంత వరకు నీరు వస్తుందన్నారు. ఇకపై వరంగల్ జిల్లాలో మూడు పంటలు పండించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే నెలరోజుల్లో మిషన్ భగీరథ పూర్తి చేస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటికి మంచి నీళ్లు వస్తాయని చెప్పారు. 

చిల్లర అధికారం కోసం, కేసీఆర్ ను ఢీకొట్టే సత్తా లేక ఆంధ్రా నుంచి చంద్రబాబు ను తీసుకుతెచ్చుకుంటారా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు సిగ్గు,శరం ఉందా అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ఆత్మగౌరవం బతికి బట్టగట్టాలంటే టీఆర్ఎస్ పార్టీకే ఓటు వెయ్యాలని కోరారు. 

పొరపాటున కూడా ప్రజాకూటమికి ఓటేస్తే తెలంగాణ ప్రజల అస్థిత్వానికే ప్రమాదం వచ్చే అవకాశం ఉందన్నారు. టీఆర్ఎస్ కు కాకుండా ప్రజాకూటమికి ఓటేస్తే మనవేలితో మన కంటిని పొడుచుకున్నట్లేనన్నారు.  
 

ఈ వార్తలు కూడా చదవండి

కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్:కేసీఆర్

టీఆర్ఎస్, ప్రజాకూటమిల మధ్య పోటీ, మిగిలిన పార్టీలు లెక్కలో లేవ్:కేసీఆర్

click me!