తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు...35 శాతం పీఆర్సీ ప్రకటించిన సీఎం

By Arun Kumar PFirst Published Sep 1, 2018, 5:25 PM IST
Highlights

తెలంగాణలోని విద్యుత్ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. ఉద్యోగులకు 35 శాతం పీఆర్సీ(వేతన సవరణ) ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు.నూతన తెలంగాణ రాష్ట్రాన్ని కరెంట్ కష్టాల నుండి కాపాడి మొదటి విజయాన్ని అందించినందుకు ఇంత భారీగా పీఆర్సీ ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. 

ఇవాళ ప్రగతి భవన్ లో విద్యుత్ ఉద్యోగులతో జరిగిన సభలో సీఎం కేసీఆర్ వారిపై వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వోద్యోగులకు సమానంగా విద్యుత్ ఉద్యోగులకు కూడా హెల్త్ స్కీం అమలుచేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించానని, ఇంకేమైనా సమస్యలుంటే వాటిని కూడా పరిష్కరించడానికి సిద్దంగా ఉన్నట్లు కేసీఆర్ తెలిపారు.

ప్రస్తుతం వృద్ది రేటులో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. తెలంగాణ దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రం లేదన్నారు. ఈ అభివృద్దికి తొలి అడుగు వేసింది విద్యుత్ ఉద్యోగులేనని కేసీఆర్ కితాబిచ్చారు.  
 
 పిపిఎఫ్,జిపిఎస్ సమస్యలను కూడా పరిష్కరించాలని అక్కడే వున్న అధికారులను కేసీఆర్ ఆదేశించారు. అలాగే కొత్తగా ఏర్పడిన సబ్ స్టేషన్లలో నూతన ఉద్యోగులను నియమించాలని సూచించారు. ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయనున్నట్లు కేసీఆర్ హామీ ఇచ్చారు.

click me!