ఓటు ద్వారా మునుగోడు పౌరుషాన్ని చూపాలి: మునుగోడులో సీఎల్పీ నేత భట్టి

By narsimha lode  |  First Published Oct 14, 2022, 5:03 PM IST

మునుగోడులో తమ ఓటు ద్వారా కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఓటును ఎవరూ కూడాఅమ్ముకోవద్దని ఆయన కోరారు. 


మునుగోడు :మనుగోడులో అమ్మకానికి  ఎవరూ కూడా  సిద్దంగా లేరనే  విషయాన్ని ఓటు ద్వారా చెప్పాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  కోరారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత చండూరులో నిర్వహించిన సభలో మల్లు భట్టి విక్రమార్క ప్రసంగించారు.తమ ఓటుతో తమ పౌరుషాన్ని  చాటాలని భట్టి విక్రమార్క  ప్రజలను కోరారు.

ఓటుతో రాజ్యాన్నినిర్మించుకోవచ్చని అంబేద్కర్ చెప్పాడని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ఓటును అమ్ముకోవద్దని ఆయన ఓటర్లను కోరారు. ఓటుతో మనకు  అవసరమైన సౌకర్యాలను తెచ్చుకోవాలన్నారు. దేనికి అమ్ముడుపోవద్దని  భట్టి విక్రమార్క ప్రజలను కోరారు. మునుగోడు నియోజకవర్గం అమ్మకానికి లేదనే విషయాన్ని చెప్పాల్సిన అవవసరం ఉందని ఆయన సూచించారు. 

Latest Videos

కాంగ్రెస్  పార్టీ మినహా ఏ పార్టీ కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు.  రాష్ట్రంలోని నాగార్జునసాగర్ సహా పలు ప్రాజెక్టులను కట్టిన పార్టీ కాంగ్రెసేనని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చిన  ఘనత కూడా తమ పార్టీదేనని ఆయన చెప్పారు.  తెలంగాణ ఏర్పాటులో ఏ  పాత్ర లేని బీజేపీ,టీఆర్ఎస్ లు  ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.  ఇచ్చిన హామలను నెరవేర్చే  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయిస్రవంతిని ఈ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు..  

alsoread:కత్తి పట్టుకుని కాంగ్రెస్ ను దెబ్బతీసే ప్రయత్నం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్

మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ దఫా దివంగత మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురును బరిలోకి దింపింది.  ఈస్థానం నుండి 12 దపాలు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఆరు దఫాలు విజయం సాధించారు. ఐదు దఫాలు సీపీఐ అభ్యర్ధులు గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు.  మరోసారి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. 
 

click me!