ఈడీ పేరిట వేధింపులు: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

By narsimha lodeFirst Published Sep 23, 2022, 5:18 PM IST
Highlights

ప్రతిపక్షాలకు ఈడీ పేరిట వేధింపులు సాగుతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.  తెలంగాణ కాంగ్రెస్ నేతలకు  ఈడీ నోటీసులు జారీ అయిన విషయమై ఆయన స్పందించారు. 
 

హైదరాబాద్:ప్రతిపక్షాలకు ఈడీ పేరిట వేధింపులు సాగుతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.  శుక్రవారం నాడు సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కేంద్రం కుట్రతోనే కాంగ్రెస్ నాయకులకు నోటీసులు జారీ చేస్తున్నారన్నారు. జాతీయ స్థాయితో పాటు రాష్ట్ర స్థాయి నేతలను కూడా  కేసులతో వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసులకు బయపడబోమన్నారు. కేసులను ఎదుర్కొంటామన్నారు. పోడు భూముల సమస్యపై జీవోతో ఉపయోగం లేదన్నారు. పోడుభూములు సాగు చేస్తున్న వారికి పట్టాలివ్వాలని ఆయన కోరారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో  తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలకు ఈడీ నుండి నోటీసులు ఇచ్చినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఏడాది ఆగస్టు 3 వ తేదీన మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ భవనంలో ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ కార్యాలయాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. 

ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ హౌస్ లో నేషనల్  హెరాల్డ్ కార్యాలయాలపై ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్  అధికారులు అంతకు ముందు రోజు సోదాలు చేశారు. ఏజేఎల్ తో అనుసంధానించిన మరో పదకొండు ప్రాంతాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.  ఈ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు సుమారు 50 గంటలకు పైగా ప్రశ్నించారు. 

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఈ ఏడాది జూలై మాసంలో  ఈడీ అధికారులు విచారించారు.అంతకు ముందు రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించారు.  ఈ ఇద్దరిని ఈడీ అధికారులు విచారించే సమయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేశ వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. న్యూఢిల్లీతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో పార్టీ క్యాడర్ ఆందోళనలు నిర్వహించింది. ఢిల్లీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేశారు.ఈ ఆందోళనలో ఆ పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. 

also read:నాకు ఈడీ నోటీసులు రాలేదు: కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్

  యంగ్ ఇండియన్ కంపెనీ కూడా ఏజేఎల్ యొక్క ఆస్తులలో రూ. 800 కోట్లకు పైగా తీసుకుందని ఈడీ  పేర్కొంది. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఈ విషయమై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఈ పిర్యాదు మేరకు ఈడీ అధికారులు విచారణను ప్రారంభించారు. 

click me!