ఎమ్మెల్యేల కొనుగోలు.. బీజేపీ- టీఆర్ఎస్ రెండూ ఒకటే : భట్టి విక్రమార్క విమర్శలు

Siva Kodati |  
Published : Oct 30, 2022, 02:34 PM IST
ఎమ్మెల్యేల కొనుగోలు.. బీజేపీ- టీఆర్ఎస్ రెండూ ఒకటే : భట్టి విక్రమార్క విమర్శలు

సారాంశం

తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో టీఆర్ఎస్- బీజేపీ రెండూ ఒకటేనని ఆయన అన్నారు. 

ఎన్నికల్లో ఓట్లను మద్యం, డబ్బుతో కొల్లగొట్టే కుట్రకు తెరలేపారని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది అత్యంత ప్రమాదకరమన్నారు. పాల్వాయి స్రవంతి కుటుంబం ప్రజాస్వామ్యంపై నమ్మకంతో సేవే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారని భట్టి ప్రశంసించారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీలలో వున్న ఎమ్మెల్యేల మాదిరిగా కోట్లను వెనకేసుకునే వ్యక్తి కాదని.. కేవలం ప్రజల కోసమే పనిచేయాలనుకున్న వ్యక్తని భట్టి ప్రశంసించారు. గడిచిన ఎమినిదేళ్ల కాలంలో ఒకసారి, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు కూడా కోట్లకు పడగలెత్తుతున్నారని ఆయన ఆరోపించారు. తనకొక్క అవకాశం ఇస్తే మునుగోడుకు సేవ చేసుకుంటానని పాల్వాయి స్రవంతి అభ్యర్ధిస్తున్నారని భట్టి అన్నారు. 

బీజేపీకి సంబంధించి కొద్దిమంది వ్యక్తులు కొందరు ఎమ్మెల్యేలను కోట్లకు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని టీఆర్ఎస్ గగ్గోలు పెడుతోందని.. ఇది ఎవరికి కొత్త అని భట్టి ప్రశ్నించారు. టీఆర్ఎస్ తెలంగాణలో .. బీజేపీ దేశవ్యాప్తంగా బీజేపీయేతర ప్రభుత్వాలు వున్న చోట ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని విక్రమార్క గుర్తుచేశారు. వీరి సాయంతో బీజేపీయేతర ప్రభుత్వాలను కూలుస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయని రాష్ట్రం లేదని, చివరికి ఓ గ్రామ సర్పంచ్‌ను కూడా వదలడం లేదని భట్టి విమర్శించారు. 

ALso REad:ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ... ముందే హెచ్చరించా, రాహుల్ పాదయాత్రకు కవరేజ్ రాకూడదనే : రేవంత్

ఇకపోతే... తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అటు కాంగ్రెస్ పార్టీ సైతం ఈ వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు యత్నంపై సుప్రీంకోర్ట్ సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై టీఆర్ఎస్ కంట్రోల్‌లో వుండే తెలంగాణ ఏసీబీతో విచారణ చేయించినా, బీజేపీ నియంత్రణలో వుండే సీబీఐతో విచారణ చేయించినా అసలు నిజాలు బయటకు రావని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే సుప్రీంకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ కోరుతున్నట్లు ఆయన తెలిపారు. 

అలాగే ఆడియో టేపుల్లో నిందితులు చెబుతున్న దానిని బట్టి.. ఢిల్లీలో వున్న బీజేపీ పెద్దలను కూడా నిందితులుగా చేర్చాలని.. వారి తర్వాతే స్వామిజీలను చేర్చాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక టీఆర్ఎస్ వుంటే గనుక... ఏ1గా కేసీఆర్, ఏ2గా కేటీఆర్.. తర్వాత నలుగురు ఎమ్మెల్యేలను నిందితులుగా చేర్చాలన్నారు. ఇదిలావుండగా .. స్వామిజీ ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు.. మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!