2023లోనూ టీఆర్ఎస్‌కు ఓటమి తప్పదు: భట్టి

Siva Kodati |  
Published : May 29, 2019, 03:11 PM IST
2023లోనూ టీఆర్ఎస్‌కు ఓటమి తప్పదు: భట్టి

సారాంశం

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం వచ్చింది. ఈ క్రమంలో టీఆర్ఎస్‌పై మండిపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం వచ్చింది. ఈ క్రమంలో టీఆర్ఎస్‌పై మండిపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.

ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని కేసీఆర్ ప్రయత్నించారన్న భట్టి.. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన కేసీఆర్‌కు ఎన్నికల్లో ప్రజలు గట్టి బుద్ది చెప్పారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ చేస్తున్న పార్టీ ఫిరాయింపులను ప్రజలు అసహ్యించుకున్నారని, లోక్‌సభ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని విక్రమార్క పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఒంటెద్దు పోకడలకు 2023లోనూ ప్రజలు బుద్ధి చెబుతారని భట్టి జోస్యం చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ
Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ