రాజకీయాలే మాట్లాడా... ఈటలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించలేదు: భట్టి విక్రమార్క

By Siva Kodati  |  First Published May 11, 2021, 8:42 PM IST

మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ తనను కలవడంపై స్పందించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఈటలతో రాజకీయ అంశాలపైనే చర్చించానని ఆయన స్పష్టం చేశారు. రాజేందర్‌ను తాను పార్టీలోకి ఆహ్వానించలేదని భట్టి పేర్కొన్నారు


మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ తనను కలవడంపై స్పందించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఈటలతో రాజకీయ అంశాలపైనే చర్చించానని ఆయన స్పష్టం చేశారు. రాజేందర్‌ను తాను పార్టీలోకి ఆహ్వానించలేదని భట్టి పేర్కొన్నారు.

తెలంగాణలో అనుకున్న లక్ష్యాలు నెరవేరడం లేదనే అభిప్రాయదంతో ఈటల ఏకీభవించారని చెప్పారు. కరోనా వ్యాప్తికి, మరణాలకు బాధ్యత ప్రభుత్వానిదేనని విక్రమార్క అన్నారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం పర్యవేక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 

Latest Videos

undefined

అంతకుముందు తనపై భూ ఆక్రమణల నిందలు వేసి మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేశారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్  మంగళవారం నాడు  భేటీ అయ్యారు. భూ ఆక్రమణలంటూ తనపై నిందలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:నిందలేసి మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేశారు: భట్టితో ఈటల భేటీ

అన్ని పార్టీల నాయకులను కలవడంలో భాగంగానే తాను మిమ్మల్ని కలుస్తున్నానని ఈటల రాజేందర్ చెప్పారు. ఇవాళ ఉదయం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసానికి  ఈటల రాజేందర్ వెళ్లారు.  రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులపై  ఈటల రాజేందర్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో చర్చించారు.

సీఎల్పీనేతతో ఈటల భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. మాసాయిపేట, హకీంపేటలో ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను ఆక్రమించుకొన్నారనే ఆరోపణలతో ఆయనను మంత్రివర్గం నుండి కేసీఆర్ తప్పించారు.

దేవరయంజాల్ లోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో ఈల రాజేందర్ ఆయన అనుచరులు భూములను ఆక్రమించుకొన్నారనే ఆరోపణలపై  ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణ నిర్వహిస్తోంది.
 

click me!