ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ: రెమిడిసివర్‌, ఆక్సిజన్‌పై కీలక నిర్ణయాలు

By Siva KodatiFirst Published May 11, 2021, 7:30 PM IST
Highlights

ప్రగతి భవన్‌‌లో మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి, లాక్ డౌన్ విధింపు తదితర అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి..  10 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. 

ప్రగతి భవన్‌‌లో మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి, లాక్ డౌన్ విధింపు తదితర అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి..  10 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది.

ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. కేవలం 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయని.. మిగిలిన 20 గంటల పాటు లాక్‌డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది. ఈ నెల 20వ తేదీన క్యాబినెట్ మరోసారి సమావేశమై , లాక్ డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి, తదుపరి నిర్ణయం తీసుకుంటుంది.

కేబినెట్ నిర్ణయాలు

  • యుద్ధ ప్రాతిపదికన.. వ్యాక్సిన్ ప్రొక్యూర్‌మెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయం
  • ప్రభుత్వ రంగంతో పాటు, ప్రైవేట్ రంగంలో కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, వీటికి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను క్యాబినెట్ ఆదేశించింది. 
  • అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం. 
  • ప్రతిరోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం.
  • రెమిడిసివర్ ఇంజక్షన్ ఉత్పత్తిదారులతో క్యాబినెట్ సమావేశం నుంచే ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి .... రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరారు. 
  • ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి సభ్యులుగా ఉంటారు.
click me!