క్లాస్ లీడర్ గా అమ్మాయి: ఓడిపోయానని విద్యార్థి ఆత్మహత్య

Published : Jul 20, 2019, 01:28 PM IST
క్లాస్ లీడర్ గా అమ్మాయి: ఓడిపోయానని విద్యార్థి ఆత్మహత్య

సారాంశం

క్షణికావేశంతో 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చరణ్ అనే విద్యార్థి తాను క్లాస్ లీడర్ ఎన్నికల్లో ఓడిపోవడంతో మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన భువనగరిలో చోటు చేసుకుంది. 

యాదాద్రి: క్షణికావేశంతో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చదువుతున్న పాఠశాలలో క్లాస్ లీడర్ గా ఎన్నిక కాలేదని అతను బలవన్మనరణానికి పాల్పడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

భువనగిరిలోని ఓ పాఠశాలలో మూడు రోజుల క్రితం క్లాస్ లీడర్ ఎన్నికలు జరిగాయి. ఎనిమిదవ తరగతిలో చరణ్ అనే విద్యార్థి క్లాస్ లీడర్ గా పోటీ చేశాడు. అయితే అతను ఓడిపోయాడు. 

క్లాస్ లీడర్ గా ఓ అమ్మాయి విజయం సాధించింది. దీంతో తీవ్ర మన స్తాపానికి గురైన చరణ్ రామన్నపేట సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై చరణ్ తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు .పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు .

చరణ్ జులై 18వ తేదీన అదృశ్యమయ్యాడని, అతని శవం రామన్నపేట రైల్వే ట్రాక్ పై కనిపించిందని భువనగిరి డిసీపీ ఎన్ రెడ్డి చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ