ఉత్తమ్ పర్యటనలో ఘర్షణ: టీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర రాళ్ల దాడి

Published : May 10, 2019, 04:15 PM ISTUpdated : May 10, 2019, 04:17 PM IST
ఉత్తమ్ పర్యటనలో ఘర్షణ: టీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర రాళ్ల దాడి

సారాంశం

సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలం పీక్లానాయక్ తండాలో శుక్రవారం నాడు కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య గొడవ చోటు చేసుకొంది. ఈ ఘర్షణలో రెండు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.


సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలం పీక్లానాయక్ తండాలో శుక్రవారం నాడు కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య గొడవ చోటు చేసుకొంది. ఈ ఘర్షణలో రెండు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.

ఈ గ్రామంలో ప్రచారం నిర్వహించేందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం  చేయడాన్ని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకొన్నారు.తమ గ్రామానికి ఏం చేశావని ఉత్తమ్‌ను నిలదీశారు.

ఈ సమయంలో రెండు పార్టీలు పరస్పరం రాళ్లు రువ్వుకొన్నారు.  ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకొన్నారు. ఈ దాడిలో గాయపడిన వారిని హుజూర్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ
Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ