తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి భగ్గుమన్న వర్గపోరు

First Published Jul 26, 2018, 10:48 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడికి విపరీతమైన స్వేచ్చ ఉంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉన్న మాట అందరికీ తెలిసిందే. ఈ స్వేచ్చే కొన్నిసార్లు తమ పార్టీ క్రమశిక్షణను దెబ్బతీస్తున్నట్లు కొందరు పెద్ద నాయకులే బహిరంగంగా మాట్లాడిన దాఖలాలున్నాయి. అయితే ఇపుడు జిల్లా స్థాయిల్లో కూడా ఇలాంటి రాజకీయాలు జరుగుతున్నాయి. ఏకంగా ఏఐసీసీ కార్యదర్శి ఎదుటే రెండు వర్గాలు బాహాబాహీకి దిగిన సంఘటన మహబూబాబాద్ లో చోటుచేసుకుంది. 

అసలు ఏం జరిగిందంటే...మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏఐసిసి కార్యదర్శి సలీం అహ్మద్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ములుగు మాజీ ఎమ్మెల్యేల వర్గీయుల మధ్య దూషనల పర్వం కొనసాగింది. తెలుగు దేశం పార్టీ నుండి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరిన మాజీ ఎమ్మెల్యే సీతక్కను టార్గెట్ గా చేస్తూ ఈ దూషణలు కొనసాగాయి. ములుగు కు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య వర్గీయులు తమ నాయకున్ని కాదని సీతక్క ను పార్టీలోకి తీసుకుని ప్రాధాన్యత కల్పించడంపై మండిపడ్డారు. గట్టిగా నినాదాలు చేసుకుంటూ సభలో రసాభాస సృష్టించారు. 

అయితే పోదెం వీరయ్య వర్గీయులకు వ్యతిరేకంగా సీతక్క వర్గీయులు కూడా నినాదాలు ప్రారంభించారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎంపీ, కేంద్ర మంత్రి బలరాం నాయక్ , ఏఐసిసి కార్యదర్శి సలీం అహ్మద్ జోక్యం చేసుకుని ఇరు వర్గీయులను శాంతింపజేశారు.

click me!