2 నిమిషాలు ఓపిక పట్టలేవా.. స్టేజ్‌పైనే ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై భగ్గుమన్న సీతారాం నాయక్

Siva Kodati |  
Published : Jan 17, 2023, 05:34 PM IST
2 నిమిషాలు ఓపిక పట్టలేవా.. స్టేజ్‌పైనే ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై భగ్గుమన్న సీతారాం నాయక్

సారాంశం

మహబూబాబాద్ జిల్లా గూడూరులో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. 

మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఏకంగా మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలోనే వీరిద్దరూ గొడవపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరులో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాజరయ్యారు. అయితే సీతారామ్ మాట్లాడుతుండగా.. మధ్యలో శంకర్ నాయక్ కల్పించుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీతారామ్ నాయక్ .. ఎమ్మెల్యేపై మండిపడ్డారు. సభలు, సమావేశాల్లో ప్రోటోకాల్ పాటించాలని స్టేజ్‌పైనే క్లాస్ పీకారు. రెండు నిమిషాలు ఓపికపడితే సరిపోదా అంటూ చురకలంటించారు. ప్రతి దాంట్లో ఏదో ఒకటి చేస్తావంటూ భగ్గుమన్నారు. మనిద్దరిది ఐదేళ్ల స్నేహమని.. గత ఐదేళ్లలో తాను 24 గంటలూ కాపాడుతూ వచ్చానని సీతారామ్ నాయక్ అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth Reddy Powerful Speech: కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శ్రీకారం | Asianet Telugu
దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ! | Hyderabad Old City House Theft | Thief Sleeping In House