బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంజయ్ ఆఫీసుపై దాడికి ప్రయత్నించిన ఎంఐఎం కార్యకర్తలను బీజేపీ శ్రేణులు కర్రలతో వెంబడించాయి. ఈ ఘర్షణ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం కరీంనగర్‌లో సంజయ్ కార్యాలయం వద్దకు ఎంఐఎం కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీకి, సంజయ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఎంఐఎం కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత మళ్లీ వచ్చిన వారు ఎంపీ కార్యాలయంపై దాడికి యత్నించారు.
దీంతో సంజయ్ ఆఫీసుపై దాడికి ప్రయత్నించిన ఎంఐఎం కార్యకర్తలను బీజేపీ శ్రేణులు కర్రలతో వెంబడించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను అడ్డుకునేందుకు యత్నించాయి. ఎంఐఎం ర్యాలీకి ఎందుకు అనుమతి ఇచ్చారంటూ బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో భారీగా మోహరించారు. స్వయంగా సీపీ సుబ్బారాయుడు పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నారు.