పార్కింగ్ విషయంలో గొడవ, ఇరువర్గాల ఘర్షణ: మహిళలనీ వదలకుండా పిడిగుద్దులు

Siva Kodati |  
Published : Sep 02, 2020, 07:59 PM ISTUpdated : Sep 02, 2020, 08:17 PM IST
పార్కింగ్ విషయంలో గొడవ, ఇరువర్గాల ఘర్షణ: మహిళలనీ వదలకుండా పిడిగుద్దులు

సారాంశం

పార్కింగ్ విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని కుల్సుంపురలోని ముస్తైద్ పురా బస్తీలో నివాసముండే ఫరూక్ హూస్సేన్ తన ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడు. 

ఇదే సమయంలో అటుగా వచ్చిన ఫిరోజ్ అలియాస్ అల్లూ వచ్చి రోడ్డుపై బైక్ ఎందుకు పెట్టావంటూ వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా తన సోదరులు దర్వేష్, జాఫర్‌తో పాటు మరికొందరితో కలిసి ఫరూక్ ఇంటిని చుట్టుముట్టాడు.

బైక్‌ని ధ్వంసం చేయడంతో  పాటు ఇంట్లోకి చొరబడి కిటికీలు, టీవీ, మొబైల్ ఫోన్లు పగులగొట్టారు. ఆ సమయంలో అడ్డొచ్చిన ఫరూక్ కుమారుడిపై దాడి చేశారు. చంపేస్తామని తుపాకీతో బెదిరించడంతో పాటు ఆడవాళ్లని కూడా చూడకుండా మహిళలపై సైతం పిడిగుద్దుల వర్షం కురిపించారు.

దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అలాంటిదేమి లేదని తాము ఫిర్యాదు స్వీకరించామని, నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Vegetables Price : దిగజారిన టమాటా, స్థిరంగా ఉల్లి... ఈ వీకెండ్ కూరగాయల రేట్లు ఇవే
IMD Rain Alert : మరో అల్పపీడనం రెడీ .. ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు