తెలంగాణ సీఎస్‌పై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే..

Published : Apr 30, 2022, 05:07 PM IST
తెలంగాణ సీఎస్‌పై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే..

సారాంశం

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో న్యాయవ్యవస్థ సమస్యల పరిష్కారంపై సీఎం, హైకోర్టు సీజే నిర్ణయాలు తీసుకున్న వాటిని అమలు చేయకుండా పెండింగ్‌లో ఉంచడంపై జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్ అయ్యారు. 
తమ వ్యక్తిగత పనుల కోసం అడగడం లేదని.. న్యాయవ్యవస్థ బలోపేతం కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. కోర్టుల్లో దయనీయమైన పరిస్థితులున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టుల్లో ఒక న్యాయవాది కోర్టు హాల్‌లోకి వెళ్లి..వెనక్కి వస్తే తప్ప మరొకరు వచ్చే పరిస్థితి లేదేని వ్యాఖ్యానించారు. 

శనివారం ఢిల్లోని Vigyan Bhawanలో హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సంయుక్త సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సదస్సులో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేలు హాజరయ్యారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ హాజ‌రు కాలేదు. ఆయన త‌ర‌ఫున తెలంగాణ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌కర‌ణ్ రెడ్డిని ఢిల్లీకి పంపారు. ఇక, ఈ సదసులో తెలంగాణ గురించి ఈ అంశాన్ని జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తావించగా.. ఇంద్రకరణ్‌ రెడ్డి ఈ అంశాలను తాను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. 

ఇక, ఈ సదసులో జస్టిస్ ఎన్వీ రమణ  మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ  విధిని నిర్వర్తించే సమయంలో లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలని అన్నారు. చట్టానికి అనుగుణంగా ఉంటే పాలనలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదని చెప్పారు. దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.

‘‘రాజ్యాంగం మూడు వ్యవస్థల మధ్య అధికార విభజనను అందిస్తుంది. మూడు వ్యవస్థల మధ్య సామరస్యపూర్వక పనితీరు ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంది. మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు.. మనం లక్ష్మణరేఖను గుర్తుంచుకోవాలి" అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు.. ఇప్పుడు వ్యక్తిగత ఆసక్తి వ్యాజ్యంగా మారాయని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగపయోగించుకోవడం బాధకరమన్నారు.

కేసులను త్వరితగతితన పరిష్కరించడానికి కోర్టుల్లో మరింత సిబ్బంది కావాలని  సీజేఐ అన్నారు. అందరి విషయంలో చట్టం సమానంగా ఉంటుందన్నారు. బాధితులకు న్యాయం అందించడంలో చట్టం అమలు అనేది అతర్భాగమని చెప్పారు. న్యాయవ్యవస్థ, ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని తెలిపారు. ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని అందరూ గౌరవించాల్సిందేనని చెప్పారు. వార్డు మెంబర్ నుంచి లోక్ సభ సభ్యుడి వరకు అందరిని గౌరవించాలని తెలిపారు. అయితే కోర్టుల ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలను పట్టించుకోకపోవడంతో ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. న్యాయపరమైన తీర్పులు వచ్చినప్పటికీ ప్రభుత్వ ఉద్దేశకపూర్వక చర్యలు ప్రజాస్వామ్యానికి అంత ఆరోగ్యకరమైనది కాదని అన్నారు. 

కోర్టుల్లో మానవ వనరుల కొరత తీరితే కేసుల భారం తగ్గుతుందన్నారు. న్యాయవ్యవస్థలోని ఖాళీలను ఎప్పటికప్పుడూ భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఏడాది కాలంగా జడ్జిల నియామకాల్లో ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని చెప్పారు. దేశంలో 10 లక్షల మంది జనాభాకు 20 మంది న్యాయమూర్తులే ఉన్నారని అన్నారు. కింది స్థాయి కోర్టుల్లో మాతృభాషలోనే తీర్పులు వెలువరించాల్సిన అవసరముందన్నారు. సీఎంలు, హైకోర్టు సీజేలు పరస్పర సహకారంతో పనిచేయాలన్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్