తెలంగాణ నుండి రాజ్యసభకు పంపే విషయం తెలియదు: ప్రకాష్ రాజ్

Published : Feb 22, 2022, 01:17 PM ISTUpdated : Feb 22, 2022, 01:37 PM IST
తెలంగాణ నుండి రాజ్యసభకు పంపే విషయం తెలియదు: ప్రకాష్ రాజ్

సారాంశం

టీఆర్ఎస్ లో రానున్న రోజుల్లో  కీలక పాత్ర పోషిస్తారనే ప్రచారం పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మంగళవారం నాడు స్పందించారు. రాజ్యసభకు తనను పంపే విషయం తెలియదన్నారు. 

 
హైదరాబాద్: తెలంగాణ నుండి తనను Rajya Sabhaకు పంపుతారనే విషయం తెలియదని సినీ నటుడు Prakash Raj చెప్పారు. తెలంగాణ సీఎంతో కలిసి మహారాష్ట్ర సీఎం Uddhav Thackerayతో ఆదివారం నాడు ప్రకాష్ రాజ్ కూడా బేటీ అయ్యారు. ఈ విషయమై ప్రకాష్ రాజ్ TRS లో కీలక పాత్ర పోషిస్తారనే ప్రచారంపై  ఆయన స్పందించారు.మంచి పనిని చెడగొట్టేందుకు ప్రచారం జరుగుతుందన్నారు.ఈ విషయాలపైమాట్లాడడానికి ఇది సరైన సమయం కాదని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు.

ప్రకాష్ రాజ్ గతంలో BJP వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గళం విప్పారు. లెఫ్ట్ పార్టీల భావ జాలం ఉన్న  ప్రకాష్ రాజ్ ఆ పార్టీ అనుబంధ విభాగాల మహాసభల్లో కూడా పాల్గొన్నారు. Telangana రాష్ట్ర సీఎం కేసీఆర్ తో కూడా ప్రకాష్ రాజ్ గతంలో సమావేశమయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఇటీవల కాలంలో మాటల దాడిని తీవ్రం చేశారు.  ఈ నెల 20వ తేదీన కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు.ఈ సమావేశానికి కేసీఆర్ ప్రత్యేక విమానంలో  ముంబైకి చేరుకొన్నారు. ముంబైలో కేసీఆర్ బృందానికి ప్రకాష్ రాజ్ స్వాగతం పలికారు. తన వెంట ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలను కేసీఆర్ ప్రకాష్ రాజ్ కు పరిచయం చేశారు KCR. 

బెంగళూరులో మాజీ ప్రధాని, జనతాదళ్ సెక్యులర్ నాయకుడు హెచ్‌డీ దేవెగౌడను కేసీఆర్ కలిసినప్పుడు ప్రకాష్ రాజ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2018 ఏప్రిల్ మాసంలో జరిగిన ఈ సమావేశానికి కొన్ని రోజుల ముందు ప్ర‌కాశ్ రాజ్  టీఆర్ఎస్ అధినేత‌తో బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల కొత్త ఫ్రంట్‌ను ఏర్పాటుకు సంబంధించిన ప్ర‌ణాళిక‌ల‌ను గురించి చర్చించారు. ఇక ప్రకాష్ రాజ్ 2019 ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రకాష్ రాజ్ తీవ్రంగా విమర్శలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో కూడా ఆయ‌న పాల్గొన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి జ‌రిగిన‌ 2020 ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

కొంత కాలంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ మాట్లాడిన సందర్భాలు లేవు. ఇటీవల కాలంలో కేసీఆర్  బీజేపీకి వ్యతిరేకంగా తన మాటల దాడిని తీవ్రం చేసిన సమయంలో ప్రకాష్ రాజ్ కేసీఆర్ తో జత కలవడం ప్రాధాన్యత సంతరించుకొంది. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ తరుణంలో ప్రకాష్ రాజ్ కూడా ఆయనతో కలిసి నడవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. 

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో ప్రకాష్ రాజ్ కు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ తరుణంలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ తరపున ప్రకాష్ రాజ్ కీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయనే ప్రచారం కూడా సాగుతుంది.ఈ తరుణంలో ప్రకాష్ రాజ్ ఈ విషయమై  స్పందించారు.   అయితే రానున్న రోజుల్లో ప్రకాష్ రాజ్ ఎలా వ్యవహరిస్తారనే విషయమై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం