రేపు మొయినాబాద్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు

Published : Sep 11, 2022, 10:03 PM ISTUpdated : Sep 11, 2022, 10:05 PM IST
రేపు మొయినాబాద్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు

సారాంశం

సినీ  నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు మొయినాబాద్ కు సమీపంలోని కనకమామిడి ఫామ్ హౌస్ లో నిర్వహించనున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. 

హైదరాబాద్: సినీ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం నాడు మధ్యాహ్నం జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణంరాజు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఆదేశించారు.

హైద్రాబాద్ కు సమీపంలోని  మొయినాబాద్ కు సమీపంలో దగ్గరలోని కనకమామిడి ఫామ్ హౌస్ లో నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. రేపు మధ్యాహ్నం హైద్రాబాద్ లోని నివాసం నుండి కృష్ణంరాజు పార్థీవదేహన్ని ఫామ్ హౌస్ కు తరలించనున్నారు. 

ఇవాళ తెల్లవారుజామున  కృష్ణంరాజు అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా కృష్ణంరాజు అనారోగ్యంతో బాధపడుతున్నారు.  అనారోగ్య సమస్యలతోనే కృష్ణంరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కృష్ణంరాజుకు పలు సీనీ ప్రముఖులు, రాజకీయ నేతలు నివాళులర్పించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?