
హైదరాబాద్: ఆనందయ్య మందుతో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని ప్రకటించింనందున ఆ మందు పంపిణీని కొనసాగించేందుకు అభ్యంతరం ఎందుకని చినజీయర్ స్వామి ప్రశ్నించారు. ఆదివారం నాడు ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో మాట్లాడారు.
ఓ మందు మనిషి ప్రాణాలు నిలబెడుతుంటే వివాదం ఎందుకని ఆయన ప్రశ్నించారు. సంక్షోభ సమయంలో వివాదాలకు తావివ్వకూడదన్నారు. అల్లోపతి వైద్యాన్ని సమాజం అంగీకరించిందన్నారు. అయితే మంచి ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చని ఆయన చెప్పారు. దాదాపుగా వారం రోజులుగా ఆనందయ్య మందు సరఫరా నిలిచిపోయింది. మందు పంపిణీ విషయమై ఎలాంటి జోక్యం చేసుకోవద్దని కోరుతూ ఏపీ హైకోర్టులో ఆనందయ్య కూడ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై సోమవారం నాడు విచారణ చేయనుంది.
also read:ప్రమాదంలో వున్నానని ఆనందయ్యే చెప్పారు... అందుకే సుప్రీంకోర్టుకు: కెఏ పాల్ సంచలనం
ఆనందయ్య మందు పంపిణీ కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు పిటిషన్లు కూడ ఏపీ హైకోర్టులో పిటిషన్లు కూడ దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కూడ హైకోర్టు కోరింది.