చినజీయర్ స్వామికి తప్పిన పెను ప్రమాదం...గుడిపైన పూజ చేస్తుండగా (వీడియో)

By Arun Kumar PFirst Published Dec 20, 2018, 3:35 PM IST
Highlights

ప్రముఖ ఆద్యాత్మిక వేత్త, వేంకటేశ్వర స్వామి ఉపాసకులు శ్రీదండి చినజీయర్ స్వామి పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్ ఓ పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడిపైకి ఎక్కి పూజలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా వేదిక కూలి ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. చినజీయర్ స్వామి కూడా సురక్షితంగా బయటపడ్డారు. 
 
ఈ ప్రమాదానికి  సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలోని కొత్తపేటలో గల అష్టలక్ష్మి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజూ కార్యక్రమాల్లో పాల్గొనడానికి చినజీయర్ స్వామిని నిర్వహకులు ఆహ్వానించగా ఆయన విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆలయం పైభాగంలో వుండే గోపుర పూజు నిర్వహించడానికి నిర్వహకులు ప్రత్యేకంగా గుడిపైభాగంలో ఓ వేదికను నిర్మించారు. ఈ వేదికపై నిల్చుని పూజారులు, చినజీయర్ స్వామి పూజలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా వేదిక కూలింది. వేదికపై వున్న పూజా సామాగ్రితో పాటు కొన్ని వస్తువులు కిందపడిపోయాయి. అయితే దానిపై వున్న పూజారులు, స్వామిజీ స్టేజి నిర్మాణం కోసం ఉపయోగించిన కర్రలను పట్టుకున్ని తమను తాము కాపాడుకున్నారు. 

ఈ ప్రమాదం నుండి చిన జీయర్ స్వామితో పాటు పూజారులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వీడియో

"

click me!