చాక్లెట్ ఇస్తానని చెప్పి... చిన్నారిపై అత్యాచారం

Published : Jul 26, 2019, 07:41 AM IST
చాక్లెట్ ఇస్తానని చెప్పి... చిన్నారిపై అత్యాచారం

సారాంశం

విజయేందర్ చేసిన పనిని చిన్నారి... సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు వివరించింది. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించి నిందితుడికి దేహ శుద్ధి చేశారు

చాక్లెట్ ఇస్తానని మాయమాటలు చెప్పి ఓ యువకుడు నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడడు. ఈ దారుణ సంఘటన ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన ఓ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. వారు వ్యవసాయ పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. కాగా... చిన్నారిని నానమ్మ వద్ద వదిలి ఆ దంపతులు ఇద్దరూ రోజూ వ్యవసాయ పనులకు వెళ్లేవారు. కాగా... దీనిని గమనించిన అదే ప్రాంతానికి చెందిన చాట్ల విజయేందర్(25) అనే యువకుడు చిన్నారి వద్దకు వచ్చాడు.

ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్ ఆశచూపించి తన ఇంటికి తీసుకువెళ్లాడు. అనంతరం తన గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విజయేందర్ కి వివాహం జరగగా... భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లింది. 

ఇదిలా ఉండగా విజయేందర్ చేసిన పనిని చిన్నారి... సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు వివరించింది. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించి నిందితుడికి దేహ శుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్