సికింద్రాబాద్ : వారం క్రితం అదృశ్యం.. చివరికి క్వారీ గుంతలో శవమై తేలిన బాలుడు

Siva Kodati |  
Published : Dec 04, 2022, 08:05 PM IST
సికింద్రాబాద్ : వారం క్రితం అదృశ్యం.. చివరికి క్వారీ గుంతలో శవమై తేలిన బాలుడు

సారాంశం

సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో అదృశ్యమైన ఉస్మాన్ అనే బాలుడు తిరుమలగిరిలోని ఓ క్వారీలో శవమై తేలాడు. అయితే చిన్నారి మరణంపై తల్లీదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.   

సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతమైంది. ఉస్మాన్ అనే బాలుడు గత నెల 28 నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో ఆదివారం తిరుమలగిరిలోని క్వారీ గుంతలో శవమై తేలాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లీదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉస్మాన్ మృతిపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu