బావిలో చెత్త పని చెప్పిన వార్డెన్... ఈత రాక , కరీంనగర్ జిల్లాలో విషాదం

Siva Kodati |  
Published : Dec 04, 2022, 07:26 PM IST
బావిలో చెత్త పని చెప్పిన వార్డెన్... ఈత రాక , కరీంనగర్ జిల్లాలో విషాదం

సారాంశం

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని సెయింట్ ఆంటోనీ స్కూల్‌లో వున్న బావిలో పడి శ్రీధర్ అనే విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు. బావిలో మొత్తం నలుగురు దిగగా.. ఓ విద్యార్ధికి ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. మిగిలిన ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరారు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. స్థానిక సెయింట్ ఆంటోనీ స్కూల్‌లో వున్న బావిలో పడి శ్రీధర్ అనే విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు. బావిలో చెత్తను తొలగించే పనిని పూరమాయించారు వార్డెన్ . అయితే బావిలో మొత్తం నలుగురు దిగగా.. ఓ విద్యార్ధికి ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. మిగిలిన ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరారు. అయితే అతనిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. విద్యార్ధి మృతదేహాన్ని బావి నుంచి వెలికితీశారు. మరోవైపు ప్రాణాలకే ప్రమాదం అని తెలిసినా బావిలో చెత్త తొలగించే పని పిల్లలకు అప్పగించిన వార్డెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే తమ కొడుకు మృతికి కారణమని ఆరోపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Danam Nagender : హైదరాబాద్ ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు.. కేటీఆర్ రియాక్షన్ ఇదే..
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Full Speech