
హైదరాబాద్: క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు. థాయిలాండ్ క్యాసినో ఘటనపై ఈడీ అధికారులు ఇటీవల చికోటి ప్రవీణ్‌కు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘనకు సంబంధించి ఈడీ అధికారులు చికోటి ప్రవీణ్‌ను విచారిస్తున్నట్టుగా తెలసిందే. ఇక, ఇటీవల థాయ్‌లాండ్‌లో అక్రమ పోకర్ గేమ్‌లో చికోటి ప్రవీణ్‌తో పెద్ద సంఖ్యలో ఇండియన్స్‌ను అక్కడి అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
నేపాల్, ఇండోనేషియాలోని బాలి ప్రాంతంలో కాసినోలను నిర్వహించడంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చికోటి ప్రవీణ్‌పై ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా థాయ్‌లాండ్‌లో చికోటి ప్రవీణ్ వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలోనే చికోటి ప్రవీణ్‌తో పాటు మెదక్ జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డికి కూడా ఇటీవల నోటీసులు జారీచేసింది. ఇదిలా ఉంటే.. ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి చికోటి ప్రవీణ్‌ను గతంలో కూడా ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.