కేసీఆర్ తో ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం తనయుడు అమిత్ జోగి భేటీ

By narsimha lode  |  First Published Feb 1, 2023, 9:26 PM IST

ఛత్తీస్ ఘడ్  మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి తనయుడు  అమిత్ జోగి  ఇవాళ కేసీఆర్ తో సమావేశమయ్యరు.  బీఆర్ఎస్ విధానాలను  అమిత్ జోగి  అడిగి తెలుసుకున్నారు.


హైదరాబాద్: ఛత్తీస్ ఘఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి తనయుడు, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమిత్ జోగి  బుధవారం నాడు  తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.  కేసీఆర్ తో  అమిత్ జోగి  మర్యాదపూర్వకంగా  సమావేశమయ్యారు.   పార్టీ ముఖ్యనాయకులతో కలిసి  బుధవారం ప్రగతి భవన్ కు  అమిత్ జోగి వచ్చారు.  కేసీఆర్ తో  పలు అంశాలపై  ఆయన సుదీర్ఘంగా  చర్చించారు.  తెలంగాణ అభివృద్ధి, దేశంలోని రాజకీయ పరిణామాలు, జాతీయ వ్యవహారాల పై  కేసీఆర్ తో  అమిత్ జోగి చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలను సిఎం కేసీఆర్ ను  అమిత్  జోగి  అడిగి తెలుసుకున్నారు. 

జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్న్యాయ రాజకీయ శక్తుల అవసరం ఉందని   అమిత్ జోగి అభిప్రాయపడ్డారు.  బీఆర్ఎస్ జాతీయ పార్టీని స్థాపించడాన్ని ఆయన  ఆహ్వానించారు. అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్ర పాలనను దేశానికి ఆదర్శంగా నిలిపారని అమిత్ జోగి  చెప్పారు. 

Latest Videos

 సంక్షేమం అభివృద్ధి రంగాల్లో దేశంలో ముందు వరసలో తెలంగాణను నిలిపేందుకు  కృషి చేశారని కేసీఆర్ ను ఆయన ప్రశంసించారు.  తన తండ్రి ఛత్తీస్ ఘఢ్  మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ తన గురించి  రాసుకున్న ఆటో బయోగ్రఫీని సిఎం కేసీఆర్ కి  బహూకరించారు.  
 

click me!