ఎంఎంటీఎస్ పొడిగింపుపై సీఎం‌కు వినతి: చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య

By Arun Kumar PFirst Published Jan 12, 2019, 11:42 AM IST
Highlights

హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్న ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను శివారు ప్రాంతాలను కూడా విస్తరించాలని  ఆయా ప్రాంతాల ప్రజలు, నాయకులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకోసం ఇప్పటికే ఈ సర్వీసులను విస్తరించేందుకు రైల్వే శాఖ కూడా చర్యలు తీసుకుంది. కొన్ని ప్రాంతాలకు త్వరలోనే ఎంఎంటీఎస్ సేవలు ప్రారంభం కానున్నట్లు కూడా ప్రకటించింది. ఈ క్రమంలో ఉద్యోగులు, విద్యార్థుల సౌకర్యార్థం ఈ ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను వికారాబాద్ వరకు పొడిగించాలన్న డిమాండ్ కూడా పెరింగింది. 

దీంతో ఇటీవల చేవెళ్ల ఎమ్మెల్యే గెలుపొందిన కాలె యాదయ్య ఈ విషయాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసిన యాదయ్య
ప్రస్తుతం లింగంపల్లి వరకు సడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లను వికారాబాద్ వరకు నడపేలా చూడాలంటూ కోరారు.  ప్రభుత్వం రైల్వే శాఖతో మాట్లాడి ఈ  దిశగా చర్యలు తీసుకోవాలని యాదయ్య సీఎంకు వినతిపత్రం సమర్పించారు. 

అంతేకాకుండా చేవెళ్ల నియోజవర్గ పరిధిలోని శంకర్ పల్లి మున్సిపాలిటీ సమస్యలపై సీఎంకు వివరించారు. ముఖ్యంగా పట్టణంలోని వార్డుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం చొరవ చూపించి త్వరగా నిర్ణయం తీసుకోనేలా చూడాలని సీఎంను యాదయ్య కోరారు.  

click me!