ట్రాఫిక్ చలానాలు ఎగ్గొట్టిన స్టార్ హీరోలు

Published : Jan 12, 2019, 11:33 AM IST
ట్రాఫిక్ చలానాలు ఎగ్గొట్టిన స్టార్ హీరోలు

సారాంశం

మన టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మంది ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వాహనాలు నడపడటమే కాకుండా.. పోలీసులు విధించిన చలానాలు కూడా చెల్లించలేదు.

సెలబ్రెటీలను చాలా మంది కామన్ పీపుల్ ఫాలో అవుతూ ఉంటారు.  వారు చేసే మంచి పనులను చూసి ఆదర్శంగా తీసుకునేవాళ్లు కూడా ఉంటారు. అలాంటి సెలబ్రెటీలు.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం ఎంత వరకు సబబు. మన టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మంది ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వాహనాలు నడపడటమే కాకుండా.. పోలీసులు విధించిన చలానాలు కూడా చెల్లించలేదు.

ట్రాఫిక్ చలానాలు ఎగ్గొట్టినవారిలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నితిన్, సునీల్ లాంటి వారు ఉన్నారు.  వేగంగా వాహనం నడపటం, సిగ్నల్స్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్ లాంటి కేసుల్లో వీరి పేర్లు నమోదయ్యాయి. అయితే.. ఆ సమయంలో కారు స్టార్ హీరోలు నడిపి ఉండకపోవచ్చు.. వారి డ్రైవర్లు నడిపి ఉండొచ్చు.. కానీ ఫైన్ వేసినప్పుడు కట్టాల్సిన బాధ్యత మాత్రం కారు ఓనరు మీదే ఉంటుంది కదా.

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఏడు చలానాలకు రూ.8, 745 చెల్లించాలి. 2016 నుంచి ఈ చలనాలు పెండింగ్ లోనే ఉన్నాయి. హీరో, హిందూపురం ఎమ్మల్యే బాలకృష్ణ ఒక చలానాకి డబ్బులు చెల్లించాల్సి ఉంది. గతేడాది 2018 మే నుంచి రూ.1,035 పెండింగ్ లో ఉన్నాయి.  ఇక జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  వాహనంపై మూడు చలానాలకు గాను రూ.505 ఫైన్ విధించగా. 2016 నుంచి రుసుము చెల్లించలేదు. హీరో నితిన్ రెడ్డి రూ.1,035.. సునీల్ రూ.4,540లు ఫైన్ చెల్లించాల్సి ఉందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్