కూకట్‌పల్లిలో చిరుత సంచారం: భయాందోళనల్లో జనం

Published : Jul 31, 2019, 11:13 AM IST
కూకట్‌పల్లిలో చిరుత సంచారం: భయాందోళనల్లో జనం

సారాంశం

కూకట్ పల్లి మిథిలా నగర్ ప్రాంతంలో చిరుతపులి  సంచరిస్తోంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.


హైదరాబాద్: హైద్రాబాద్ కూకట్‌పల్లి మిథిలానగర్‌లో చిరుత పులి  సంచరించడాన్ని స్థానికులు గుర్తించారు. మంగళవారం రాత్రి నుండి బుధవారం నాడు తెల్లవారుజాము వరకు చిరుతపులిని స్థానికులు గుర్తించారు. చిరుతను సెల్‌ఫోన్‌లో గుర్తించారు.

స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.అటవీశాఖాధికారులు బుధవారం నాడు ఉదయం  ఈ ప్రాంతంలో  గాలింపు చర్యలు చేపట్టారు. మిథిలానగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ లో దూరి కొందరిని గాయపర్చినట్టుగా ప్రచారం సాగుతోంది.అయితే ఈ విషయమై స్పష్టత రాలేదు.

కూకట్‌పల్లిలోని మిథిలానగర్ ప్రాంతంలో చిరుత సంచరించినట్టుగా చెబుతున్న ప్రాంతంలో అటవీ శాఖాధికారులు గాలిస్తున్నారు. చిరుత కాలి గుర్తులను ఫారెస్ట్ అధికారులు సేకరిస్తున్నారు.

ఇక్కడికి సమీపంలోని నర్సాపూర్ అటవీ ప్రాంతం అంతరించిపోయింది. ఈ కారణంగానే  అటవీ ప్రాంతం నుండి జంతువులు జనావాసాల్లోకి వస్తున్నట్టుగా అటవీ శాఖాధికారులు చెబుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

School Holidays: కుండపోత వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
TG Police Recruitment 2026: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ ఎంత? జీతం, క్వాలిఫికేషన్, నెగెటివ్ మార్కింగ్ ఫుల్ డీటైల్స్