భయపెట్టడంతోనే నా కూతురు అలా చెప్పి ఉండొచ్చు: శాలిని పెళ్లి వీడియోలపై పేరేంట్స్

By narsimha lode  |  First Published Dec 20, 2022, 5:25 PM IST

తన కూతురిని భయపెట్టడంతోనే  పెళ్లి చేసుకున్నట్టుగా చెబుతుందని శాలిని పేరేంట్స్ చెబుతున్నారు.  తాను ప్రేమించిన యువకుడిని  పెళ్లి చేసుకున్నట్టుగా శాలిని వీడియోలు, ఫోటోలు విడుదల చేయడంపై  తల్లిదండ్రులు స్పందించారు.


కరీంనగర్:  తన కూతురిని భయపెట్టడంతోనే  పెళ్లి చేసుకున్నట్టుగా చెబుతుందని  శాలిని పేరేంట్స్ ఆరోపిస్తున్నారు. తాను  జ్ఞానేశ్వర్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్టుగా  శాలిని ఫోటోలు, వీడియోలు విడుదల చేయడంపై  ఆమె తల్లిదండ్రులు  మీడియాతో మాట్లాడారు. 

 కిడ్నాప్ చేసిన  నిందితులు తమ కూతురిని బెదిరించి ఉంటారని  వారు ఆరోపించారు. జాన్ ను పెళ్లి చేసుకుంటే  అతనితో  తన కూతురు ఇష్టంగా వెళ్లేదన్నారు. కానీ ఆమెను నిందితులు  ఎందుకు కిడ్నాప్  చేస్తారో  చెప్పాలని శాలిని తల్లి ప్రశ్నించారు. మమ్మల్ని  చంపుతామని  బెదిరిస్తే తమ కూతురు ఒప్పుకోని ఉండొచ్చని  వారు  అనుమానం వ్యక్తం చేశారు. నిన్న తన కూతురుకు  వేరే యువకుడితో  నిశ్చితార్ధం కూడా జరిగిందని  శాలిని పేరేంట్స్  చెప్పారు.  గతంలో కూడా  నిందితుడిపై కేసు నమోదు చేసిన సమయంలో పురుగుల మందు డబ్బాతో వారు పోలీస్ స్టేషన్  కు వచ్చిన విషయాన్ని శాలిని తల్లి గుర్తు చేస్తున్నారు. నిన్న ఎంగేజ్ మెంట్ సమయంలో తమ కూతురు సంతోషంగా ఉందని  కూడా శాలిని తల్లి గుర్తు చేశారు.  తన పెళ్లికి  ఎంత డబ్బిస్తారో  చెప్పాలని   మేనమామాలను  తన కూతురు అడిగిందని శాలిని తల్లి చెప్పారు. 

Latest Videos

also read:సిరిసిల్లలో యువతి కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్.. పెళ్లి దుస్తుల్లో ఉన్న వీడియో విడుదల.. అసలేం జరిగిందంటే..?

తన కూతురును భయపెట్టడంతో ఆమె వీడియోలో  అలా మాట్లాడి ఉండొచ్చని  శాలిని తండ్రి చంద్రయ్య అనుమానం వ్యక్తం చేశారు. తన కూతురికి సంబంధించిన సమాచారం తెలియదన్నారు. తన బిడ్డను తమకు అప్పగిస్తే  అసలు విషయాలు తెలుస్తాయని  శాలిని తండ్రి చంద్రయ్య  అభిప్రాయపడ్డారు.
 

click me!