ఆత్మహత్యలొద్దు: ఆర్టీసీ సమ్మెపై స్పందించిన చంద్రబాబు

By narsimha lodeFirst Published Oct 14, 2019, 6:23 PM IST
Highlights

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు స్పందించారు. ఆర్టీసీ సమ్మెను ఉధృతం చేయాలని ఆర్టీసీ జేఎసీ నేతలు ప్రయత్నిస్తున్నారు. 

విజయవాడ: ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడకూడదని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను కలిచివేశాయని ఆయన చెప్పారు.

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె, కార్మికుల ఆత్మహత్యలపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు స్పందించారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం తనను కలచివేసిందన్నారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావన్నారు. జీవితం ఎంతో విలువైందన్నారు.

బతికి సాధించాలే తప్ప బలవన్మరణం పరిష్కారం కాదని చంద్రబాబు సూచించారు.. ఎవరూ, ఎక్కడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడవద్దని ఆయన కోరారు. ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించాలని ఆయన కోరారు. 

ఈ నెల 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్న కార్మికులు సెల్ప్ డిస్మిస్ అయ్యారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో కార్మికులు మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకొన్నారు. సోమవారం నాడు మరో కార్మికులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంతో చర్చించేందుకు తాము సిద్దంగానే ఉన్నామని ప్రకటించారు. చర్చలకు కేకే మధ్యవర్తిగా ఉంటే తమకు అభ్యంతరం లేదన్నారు. ఆత్మహత్యలు చేసుకోకుండా చర్చించాలని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఆర్టీసీ కార్మికులకు సోమవారం నాడు విన్నవించారు.ఈ వినతి మేరకు ఆర్టీసీ కార్మికులు స్పందించారు.

click me!