చంచల్‌గూడ జైల్లో భూమా అఖిలప్రియ: యూటీ నెంబర్ 1509 కేటాయింపు

By narsimha lodeFirst Published Jan 7, 2021, 12:49 PM IST
Highlights

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు చంచల్‌గూడ జైల్లో 1509 నెంబర్ ను పోలీసులు కేటాయించారు.

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు చంచల్‌గూడ జైల్లో 1509 నెంబర్ ను పోలీసులు కేటాయించారు.

హైద్రాబాద్ బోయిన్‌పల్లికి చెందిన ప్రవీణ్ రావుతో పాటు ఆయన ఇద్దరు సోదరులను మంగళవారం నాడు రాత్రి కిడ్నాపర్లు కిడ్నాప్ చేశారు.ఈ ముగ్గురిని నార్సింగి సమీపంలోని నిందితులు వదిలివెళ్లారు.

ఈ కిడ్నాప్ విషయంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులు కీలకపాత్ర పోషించారని పోలీసులు గుర్తించారు.ఈ కేసులో ఏ -1 గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ-2గా భూమా అఖిలప్రియ, ఏ-3గా భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

also read:బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు: బెంగుళూరులో భార్గవ్ రామ్?, పోలీసుల గాలింపు

బుధవారం నాడు గాంధీలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత  కోర్టులో హాజరుపర్చడంతో కోర్టు ఆమెకు జ్యూడీషీయల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను బుధవారం నాడు చంచల్ గూడ జైలుకు తరలించారు.

చంచల్‌గూడ జైలులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు అధికారులు యూటీ 1509 నెంబర్ కేటాయించారు. అఖిలప్రియ ఆరోగ్యంగానే ఉందని జైలు అధికారులు తెలిపారు.

అఖిలప్రియకు జైలులో ఎలాంటి ప్రత్యేక గదిని కేటాయించలేదని చెప్పారు.అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

click me!