పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు.. నడిరోడ్డులో వృద్ధురాలి మెడలో గొలుసు దొంగతనం..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 02, 2020, 12:12 PM IST
పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు.. నడిరోడ్డులో వృద్ధురాలి మెడలో గొలుసు దొంగతనం..

సారాంశం

కరీంనగర్ లో పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డుమీద నడిచి వెడుతున్న వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లారు. రెండు రోజుల క్రితం ఆటో చోరీ జరిగింది. 

కరీంనగర్ లో పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డుమీద నడిచి వెడుతున్న వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లారు. రెండు రోజుల క్రితం ఆటో చోరీ జరిగింది. 

ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నట్టుగా సీసీ ఫుటేజీ ఆధారంగా తెలుస్తోంది. ఇద్దరు దుండగుల్లో ఒకరు హెల్మెట్‌  ధరించగా, మరొకరు మాస్క్‌ పెట్టుకున్నారు. మంచిర్యాల చౌరస్తా మీదుగా వచ్చి అశోక్ నగర్‌లో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.  

అశోక్ నగర్ లో రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్న సత్తెమ్మ మెడలో బంగారు గొలుసులు లాక్కెళ్లారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏడుతులాల విలువైన బంగారు గొలుసని తెలిపింది. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల ఫోటోలను పోలీసులు రిలీజ్‌ చేశారు. 

వీరి ఆచూకి తెలిపిన వారికి నగదు ప్రోత్సాహం ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అదే విధంగా గతనెల 8న  స్టార్ హాస్పిటల్  వద్ద ఉన్న ఆటోను ఎత్తుకెళ్ళిన్నట్లు పోలీసులు తెలిపారు. 

దొంగలు నిజామాబాద్ నుంచి పెర్కిట్ వరకు  బైక్ పై వచ్చి అక్కడి నుంచి బస్ లో కరీంనగర్ కు చేరుకుని ఆటోను తీసుకుని నిజామాబాద్ వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయినట్లు ఫోటోలు విడుదల చేశారు. మారుతి సుజు ఆటో గురించి  తెలిపినవారికి 25000 పారితోషికం ఇస్తామని ప్రకటించారు. దుండగుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !