కేసీఆర్ కు ధీటుగా: తెలంగాణ రాజకీయాల్లోకి విద్యాసాగర రావు

Published : Sep 02, 2019, 10:22 AM IST
కేసీఆర్ కు ధీటుగా: తెలంగాణ రాజకీయాల్లోకి విద్యాసాగర రావు

సారాంశం

సిహెచ్. విద్యాసాగర రావు తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన భూమిక పోషించే అవకాశం ఉంది. ఆయనకు కీలకమైన బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ రాజకీయాల్లో బిజెపి పాగా వేయాలని చూస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావును ధీటుగా ఎదుర్కునేందుకు బిజెపి జాతీయ నాయకత్వం పకడ్బందీ వ్యూహరచన చేసినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర గవర్నర్ గా చెన్నమనేని విద్యాసాగర రావు పదవీకాలాన్ని పొడగించలేదని భావిస్తున్నారు. 

సిహెచ్. విద్యాసాగర రావు తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన భూమిక పోషించే అవకాశం ఉంది. ఆయనకు కీలకమైన బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ రాజకీయాల్లో బిజెపి పాగా వేయాలని చూస్తోంది. మహారాష్ట్ర గవర్నర్ గా వెళ్లడానికి ముందు విద్యాసాగర రావు రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2023 ఎన్నికల్లో తెలంగాణలో కీలక ప్రచార బాధ్యతలను ఆయనకు బిజెపి నాయకత్వం అప్పగించే అవకాశం ఉంది. 

కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యాసాగర రావుకు ఉత్తర తెలంగాణలో మంచి పలుకుబడి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన మెట్ పల్లి నుంచి 18985 నుంచి 1998 వరకు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 1998లో ఆయన కరీంనగర్ లోకసభ స్థానం నుంచి విజయం సాధించారు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 

సుదీర్ఘమైన రాజకీయ అనుభవాన్ని, ప్రజలతో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని బిజెపి అధినాయకత్వం విద్యాసాగరరావును తెలంగాణ రాజకీయాల్లోకి దించాలనే చూస్తోంది.

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?