పోలింగ్ సమయం పెంచేదిలేదు.. రజత్ కుమార్

By ramya neerukondaFirst Published Dec 7, 2018, 1:01 PM IST
Highlights

ఈవీఎంలు మోరాయించడం తదితర కారణాల వల్ల చాలా ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో.. పోలింగ్ సమయాన్ని పెంచాల్సిందిగా కొందరు ఓటర్లు అధికారులను కోరుతున్నారు.

పోలింగ్ సమయం పెంచేది లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఈవీఎంలు మోరాయించడం తదితర కారణాల వల్ల చాలా ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో.. పోలింగ్ సమయాన్ని పెంచాల్సిందిగా కొందరు ఓటర్లు అధికారులను కోరుతున్నారు.

కాగా.. ఈ విషయంపై రజత్ కుమార్ స్పందించారు. అన్ని చోట్ల కరెక్ట్ టైమ్ కే పోలింగ్ ప్రారంభమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం రెండు, మూడు నియోజకవర్గాల్లోనే సమస్యలు తలెత్తాయని చెప్పారు. ఓటర్లు ఓటు వేయకుండా ఎక్కడా వెనక్కి వెళ్లిపోలేదని చెప్పారు.

ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నిక​ల పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈరోజు వాహనదారులకు టోల్‌ప్లాజా రుసుం చెల్లింపు నుంచి ఎన్నికల సంఘం ఊరట కల్పించింది. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు టోల్‌ప్లాజా రుసుం చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం ఆదేశించింది.

click me!