సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకున్న టీఆర్ఎస్

Published : Dec 07, 2018, 12:34 PM IST
సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకున్న టీఆర్ఎస్

సారాంశం

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఓ పోలింగ్ బూత్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు ప్రజాకూటమి అభ్యర్థి, మాజీమంత్రి సబితారెడ్డిని టీఆర్ఎస్, బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. సబితా పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు వీలులేదని వారు డిమాండ్ చేశారు.   

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఓ పోలింగ్ బూత్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు ప్రజాకూటమి అభ్యర్థి, మాజీమంత్రి సబితారెడ్డిని టీఆర్ఎస్, బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. సబితా పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు వీలులేదని వారు డిమాండ్ చేశారు. 

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరువర్గాలను శాంతింప జేశారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ పార్టీ ప్రజను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఏదిఏమైనా ప్రజాకూటమి విజయం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

PREV
click me!

Recommended Stories

Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్
IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!