తెలంగాణకు గుడ్ న్యూస్ : ఎయిమ్స్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

By Nagaraju TFirst Published Dec 17, 2018, 11:52 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం తీపి కబురు అందించింది. రూ. 1028 కోట్లతో బీబీనగర్‌లో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ప్రధానమంత్రి స్వస్థి యోజన  పథకం కింద ఎయిమ్స్ ఆస్పత్రికి అంగీకారం తెలిపింది. 
 

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం తీపి కబురు అందించింది. రూ. 1028 కోట్లతో బీబీనగర్‌లో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ప్రధానమంత్రి స్వస్థి యోజన  పథకం కింద ఎయిమ్స్ ఆస్పత్రికి అంగీకారం తెలిపింది. 

ఈ ఎయిమ్స్ ఆసుపత్రిలో 100 ఎంబీబీఎస్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. 750 పడకలతో 15 నుంచి 20 ప్రత్యేక విభాగాలతో ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. ఎయిమ్స్ లో 1500 ఓపీ, 1000 మంది ఇన్ పేషెంట్లకు నేరుగా చికిత్స అందే అవకాశం ఉంది. 

ఎయిమ్స్ ఎమర్జెన్సీ, ట్రామా కేర్, ఆయుష్, ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. మెడికల్ కళాశాల సహా ఇతర సదుపాయాలన్నీ 45 నెలల్లో ఏర్పాటు చెయ్యాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. 

ఇటీవలే సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటు చెయ్యాలని కోరారు. మరోవైపు 1264 కోట్ల రూపాయల ఖర్చుతో తమిళనాడులోని మధురైలోనూ ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మాణానికి కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. 

click me!