రూ.200 కోట్ల టోకరా: రిషబ్ చిట్స్ యజమాని శైలేష్ అరెస్ట్

By narsimha lodeFirst Published Dec 20, 2018, 3:40 PM IST
Highlights

రిషబ్ చిట్‌ఫండ్ యజమాని శైలేష్ గుజ్జార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: రిషబ్ చిట్‌ఫండ్ యజమాని శైలేష్ గుజ్జార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిట్‌ఫండ్స్, డిపాజిట్ల పేరుతో శైలేష్  రూ.200 కోట్లకు పైగా వసూలు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

గోవాలో క్యాసినోలు నడిపిన శైలేష్ నష్టపోయినట్టుగా  పోలీసులు చెబుతున్నారు. హైద్రాబాద్‌లో కూడ పలు పబ్‌ల్లో కూడ శైలేస్ గుజ్జార్ పెట్టుబడులు పెట్టినట్టుగా  పోలీసులు అనుమానిస్తున్నారు.

చాలా కాలంగా ను రిషబ్ చిట్‌ఫండ్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. శైలేష్‌ తో పాటు ఆయన భార్య నందిని కూడ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
మహంకాళి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రిషబ్ ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.  

చిట్‌ఫండ్ లతో పాటు  ఎక్కువ వడ్డీలను ఆశలు చూపి డిపాజిట్లను సేకరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు శైలేష్ గుజ్జార్ ను అరెస్ట్ చేశారు.ఈ డబ్బులను శైలేష్ ఎక్కడ దాచారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

click me!