ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైద్రాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ ను సీబీఐ అధికారులు ఇవాళ్టి నుండిమూడు రోజుల పాటు విచారించనున్నారు. నిన్ననే అభిషేక్ రావును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: డిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన హైద్రాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావు ను సీబీఐ అధికారులు మంగళవారం నుండి విచారించనున్నారు సోమవారం నాడు న్యూఢిల్లీలో అభిషేక్ రావును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో హైద్రాబాద్ కు చెందిన కంపెనీలకు సంబంధాలున్నాయని సీబీఐ అనుమానిస్తుంది.ఈ కేసులో ఇప్పటికే అరుణ్ రామచంద్రన్ పిళ్లైపై సీబీఐ కేసు నమోదు చేసింది.ఈ కేసు ఆధారంగానే ఈడీ అధికారులు హైద్రాబాద్ కేంద్రంలో నాలుగు దఫాలు సోదాలు నిర్వహించారు.
undefined
హైద్రాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావు రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఎల్ఎల్ సీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.అభిషేక్ రావును విచారించేందుకు అనుమతివ్వాలని సీబీఐ అధికారులు నిన్న కోర్టును కోరారు. ఈ మేరకు కోర్టు అనుమతిని ఇచ్చింది.దీంతో ఇవాళ్టి నుండి మూడు రోజుల పాటు అభిషేక్ రావును సీబీఐ అధికారులు విచారించనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో తెలంగాణలో అధికార పార్టీకి చెందిన కొందరికి ప్రమేయం ఉందని బీజేపీ ఆరోపణలు చేసింది. విచారణ సంస్థలు ఈ విషయాలను బయట పెడతాయని బీజేపీనేతలు చెబుతున్నారు.
బోయినపల్లి అభిషేక్ రావు ఖాతాల్లోకి రూ.3.85 కోట్లు ఎలా వచ్చాయనే విషయమై సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో అభిషేక్ రావు కీలకంగా వ్యవహరించారని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. అభిషేక్ రావు వ్యాపార లావాదేవీలు, ఎక్కడెక్కడి నుండి అభిషేక్ కు నగదు వచ్చిందనే విషయాలను సీబీఐ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై ఈడీ అధికారులు కూడా హైద్రాబాద్ కేంద్రంగా నాలుగు సార్లు సోదాలు నిర్వహించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ కేసు విషయమై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో కీలక సమాచారాన్ని సేకరించారు. హైద్రాబాద్ లోని ఓ ప్రముఖ ఆడిటర్ నివాసంలో నిర్వహించిన సోదాల సమయంలో సేకరించిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
also read:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. హైదరాబాద్ వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్‌కు మూడు రోజుల కస్టడీ..
గత నెల, ఈ మాసంలో నిర్వహించిన సోదాల సమయంలో సేకరించిన సమాధారం ఆధారంగా సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ లు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై హైద్రాబాద్ కు చెందిన అభిషేక్ రావును అరెస్ట్ చేయడంపై ప్రస్తుతం చర్చకు దారితీసింది. అభిషేక్ రావు నుండి సేకరించిన సమాచారం ఆధారంగా ఈడీ,సీబీఐ అధికారులు తదుపరి కార్యాచారణ ఉండనుంది.