వామన్ రావు హత్య: మంథని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై కేసు నమోదు

Siva Kodati |  
Published : Apr 06, 2021, 07:40 PM ISTUpdated : Apr 06, 2021, 07:41 PM IST
వామన్ రావు హత్య: మంథని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై కేసు నమోదు

సారాంశం

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పుట్ట శైలజపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో ఆమెపై మంథని పోలీసులు కేసు నమోదు చేశారు. 

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పుట్ట శైలజపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో ఆమెపై మంథని పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు న్యాయవాది వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసు విచారణలో భాగంగా ఈ నెల 19న నిందితుడు బిట్టు శ్రీనును మంథని కోర్టుకు తీసుకొచ్చారు.

ఆ సమయంలో అక్కడికి వచ్చిన శైలజ.. బిట్టు శ్రీనుతో వీడియో కాల్‌ మాట్లాడించినట్లు అప్పుడు విధుల్లో ఉన్న ఎస్సై ప్రవీణ్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారు. పోలీసులు వారించినా వినకుండా బిట్టు శ్రీనుతో ఫోన్ మాట్లాడించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిని పరిగణనలోనికి తీసుకున్న న్యాయస్థానం.. శైలజపై కేసు నమోదు  చేయాల్సిందిగా ఆదేశించి. దీంతో మంథని పోలీసులు సెక్షన్ 186 కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫిబ్రవరిలో మంథని కోర్టులో పని ముగించుకుని మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్ వెళ్తున్న న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతులను కుంట శ్రీను, చిరంజీవిలు హత్య చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్