నగరంలో అర్థరాత్రి కారు బీభత్సం

Published : Jul 02, 2019, 10:22 AM IST
నగరంలో అర్థరాత్రి కారు బీభత్సం

సారాంశం

హైదరాబాద్ నగరంలో అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది.  జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద అర్థరాత్రి  ఓ వ్యక్తి బెంజ్ కారులో వచ్చి బీభత్సం సృష్టించాడు.  

హైదరాబాద్ నగరంలో అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది.  జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద అర్థరాత్రి  ఓ వ్యక్తి బెంజ్ కారులో వచ్చి బీభత్సం సృష్టించాడు.  సిగ్నల్ వద్ద టర్న్ చేస్తుండగా అదుపు తప్పిన కారు డివైడర్ ని ఢీ కొట్టింది. కారు అతి వేగంతో రావడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు  చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. అయితే... పోలీసులు వస్తే తనను అరెస్టు చేస్తారేమోననే భయంతో డ్రైవర్ కారు అక్కడే వదిలి పారిపోవడం గమనార్హం. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో కారును తొలగించారు. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జుు అయ్యింది.

ఇదిలా ఉంటే అసలు ఈ కారు ఎవరిది..? పరారైన వ్యక్తి ఎవరు..? కారు ఎవరిపేరిట రిజిస్ట్రేషన్ అయ్యింది..? కారు నడిపిందెవరు..? అనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

గంట‌కు 320 కి.మీల వేగం.. 3 గంట‌ల్లోనే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్‌. స్టేష‌న్లు ఇవే.
హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో ఇన్నోవేషన్‌ పార్కు.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.? దీని ఉపయోగం ఏంటి.?