గచ్చిబౌలిలో కారు బీభత్సం: కారు నడిపిన రాథోడ్ సహా మహిళ మృతి

Published : Mar 18, 2022, 06:06 PM ISTUpdated : Mar 18, 2022, 07:04 PM IST
గచ్చిబౌలిలో కారు బీభత్సం: కారు నడిపిన రాథోడ్ సహా మహిళ మృతి

సారాంశం

హైదరాబాదులోని గచ్చిబౌలిలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మరణించింది. యువకులు మద్యం మత్తులో కారును నడిపినట్లు భావిస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాదులో విచక్షణారహితమైన కారు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, హైదరాబాదులోని గచ్చిబౌలిలో కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఫుట్ పాత్ మీదికి దూసుకెళ్లింది. చెట్లకు నీళ్లు పడుతున్న మహిళను ఢికొట్టింది. దీంతో 50 ఏళ్ల ఆ మహిళ అక్కడికక్కడే మరణించింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. మద్యం మత్తులో యువకులు కారు నడిపినట్లు తలెస్తోంది. 

ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. వారిద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కూకట్ పల్లికి చెందన రాథోడ్ కారును నడపుతున్నట్లు గుర్తించారు. అతను మద్యం సేవించినట్లు అనుమానిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో కారు నడిపిన రాథోడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దుర్మరణం పాలయ్యాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.గాయపడినవారిలో ఓ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

మృతి చెందిన మహిళను మల్లీశ్వరిగా గుర్తించారు. గాయపడి చికిత్స పొందుతున్న యువతిని గాయత్రిగా గుర్తించారు. విప్రో జంక్షన్ నుంచి వస్తున్న కారు ఫుట్ పాత్ మీదికి దూసుకుని వెళ్లింది. ఎడమ వైపు కారు దూసుకుని వెళ్లి, డివైడర్ ను ఢీకొట్టి ఫుట్ మీదికి తీసుకుని వెళ్లి బోల్తా పడింది. దాన్ని బట్టి కారు ఎంత వేగంతో ప్రయాణిస్తుందో అర్థం చేసుకోవచ్చు. నిర్లక్ష్యంతో రాథోడ్ కారు నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. క్లూస్ టీంను పిలిపించి పోలీసులు ఆరా తీస్తున్నారు.  

మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం
Hyderabad Vegetable Price : ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉంటాయంటే..