రన్నింగ్ కారులో మంటలు... నడిరోడ్డుపైనే కాలిబూడిద (వీడియో)

Published : May 28, 2023, 10:27 AM IST
రన్నింగ్ కారులో మంటలు... నడిరోడ్డుపైనే కాలిబూడిద (వీడియో)

సారాంశం

రన్నింగ్ కారులో మంటలు చెలరేగిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమీపంలో జరిగింది. 

పెద్దపల్లి : రోడ్డుపై వేగంగా వెళుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చేలరేగిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. మంటలను గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. 

నిన్న(శనివారం) జనగామ నుండి గోదావరిఖని వెళుతున్న కారు ఒకటవ గని చెక్ పోస్ట్ వద్దకు మంటల్లో చిక్కుకుంది. కారు ముందుభాగంలోని ఇంజన్ లో ప్రారంభమైన మంటలు కారు మొత్తాన్ని వ్యాపించాయి. కారులోంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే కిందకు దిగిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. 

వీడియో 

నడిరోడ్డుపై కారులో భారీగా మంటలు చెలరేగడం గమనించినవారు ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే ఫైరింజన్ తో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసారు. కానీ అప్పటికే కారు మంటల్లో పూర్తిగా ధగ్దమయ్యింది. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే