హైదరాబాద్ శివారులో యువకుడి దారుణ హత్య.. గుర్తుపట్టకుండా దుస్తులు తీసేసి....

Published : May 29, 2023, 12:23 PM IST
హైదరాబాద్ శివారులో యువకుడి దారుణ హత్య.. గుర్తుపట్టకుండా దుస్తులు తీసేసి....

సారాంశం

హైదరాబాద్ శివారుల్లో ఓ యువకుడు దారుణంగా హత్య చేయబడ్డాడు. అతని మృతదేహం కుళ్లిన స్థితిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం అతడిని చంపినట్టుగా గుర్తించారు. 

హైదరాబాద్ : హైదరాబాద్ లోని హయత్ నగర్ శివారులో యువకుడి దారుణ హత్య వెలుగు చూసింది. అతడిని వరంగల్ కు చెందిన రాజేష్ (23) గా గుర్తించారు. శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో రాజేష్ పనిచేస్తున్నాడు. అతడిని 4 రోజుల క్రితం చంపేసి ఉంటారని పోలీసులు అంటున్నారు. రాజేష్ ను గుర్తు పట్టకుండా దుండగులు ఒంటి మీది దుస్తులు తీసేశారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రాజేష్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

హైదరాబాద్ లోనే ఉండే రాజేష్ స్వస్థలం వరంగల్. ప్రస్తుతం వరంగల్ లో ఉన్న అతను స్నేహితుడి పెళ్లి ఉందంటూ హైదరాబాద్ కు వచ్చాడు. ఈ నెల 20న వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. అతడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి నిర్మానుష్య ప్రదేశమంలో పడేశారు.

వరంగల్ నుంచి వచ్చిన రాజేష్  ఇబ్రహీంపట్నంలో ఫ్రెండ్ రూంలో ఉన్నాడు. అక్కడినుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎవరు అతడిని హత్య చేశారు? అనే విషయాలు మిస్టరీగా మారాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana: బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు.. అస‌లు కార‌ణం అదేనా.? కాంగ్రెస్ వాద‌న ఏంటంటే
Jeevan Reddy: అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని: జీవన్ రెడ్డి | Asianet News Telugu