ఆరుబయట నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్య... తల, మొండెం వేరు

Arun Kumar P   | Asianet News
Published : Apr 20, 2020, 12:12 PM IST
ఆరుబయట నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్య... తల, మొండెం వేరు

సారాంశం

వేసవికాలం సందర్భంగా ఆరుబయట నిద్రిస్తున్న ఓ  వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. 

నారాయణపేట: వేసవికాలం సందర్భంగా ఆరుబయట నిద్రిస్తున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయిన దారుణ సంఘటన నారాయణపేట మండల పరిధిలో చోటుచేసుకుంది. తల, మొండెంను వేరుచేసి అతి దారుణంగా హత్యచేశారు.

నారాయణపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన గోపాల్ ఆదివారం రాత్రి ఇంటి వరండాలో పడుకున్నాడు. అయితే అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు అతడిపై దాడికి  పాల్పడ్డారు. పదునైన ఆయుధంతో  మెడపై దాడిచేయగా తల మొండెం వేరయ్యాయి. ఇలా అతడు నిద్రలోనే  ప్రాణాలు కోల్పోయాడు. 

ఉదయం రక్తపుమడుగులో పడివున్న అతడి మృతదేహాన్ని గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. 


 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : సంక్రాంతి సెలవులు మరో రెండ్రోజులు పొడిగిస్తారా..?
IMD Weather Update : కనుమ రోజు కనువిందు చేసే వెదర్.. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం