Telangana Assembly Elections 2023: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తున్నదనీ, మరోసారి తామే అధికారంలోకి వస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పర్చడంలో తమను మించిన వారు లేరనీ, ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ను మరోసారి గెలిపిస్తాయనీ, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
Social Welfare Minister and BRS leader Koppula Eshwar: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తున్నదనీ, మరోసారి తామే అధికారంలోకి వస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పర్చడంలో తమను మించిన వారు లేరనీ, ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ను మరోసారి గెలిపిస్తాయనీ, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
వివరాల్లోకెళ్తే.. గడిచిన అయిదేళ్ల కాలంలో తెలంగాణ లో అద్భుతమైన ప్రగతి సాధించామని రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో ప్రజా అశీర్వదయాత్రలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సందర్బంగా మీడియతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ దర్శకంలో ఒక్క ధర్మపురి నియోజకవర్గం లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొట్లాది రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి సంక్షేమ పధకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు.
undefined
సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా, మండల, గ్రామ స్థాయి ప్రజా ప్రతి నిధులు ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ.. అభివృద్ధి లో ప్రజలను భాగ స్వామ్యూలను చేశారాని అన్నారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగంలో ప్రవేశ పెట్టి అమలు చేసిన పథకాలు అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయని చెప్పారు. అలాగే, పల్లె ప్రగతి, మిషన్ భగీరథ, మనఊరు మన బడి లోనూ ప్రజల్లో మార్పు తీసుకొని రావడం జరిగిందాన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు అభివృద్ధి ప్రగతిని గమనించి నిర్ణయం తీసుకుంటారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
కాగా, మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనీ, ముఖ్యమంత్రిగా కేసీఆర్ వరుసగా మూడోసారి పదవి చేపట్టి దక్షిణ భారతంలో రికార్డు సృష్టిస్తారని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలు ఏకపక్షమే అనీ, భారత రాష్ట్ర సమితికి భారీ విజయం ఖాయం అన్నారు. రెండుసార్లు ప్రజలు నిండు మనసుతో ప్రజా ఆశీర్వాదం అందించారని మూడోసారి కూడా ప్రజలు భారత రాష్ట్ర సమితికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. డిసెంబర్ 3న వచ్చే ఎన్నికల ఫలితాల ద్వారా సబ్బండ వర్గాలకు సంక్షేమాన్ని అందించిన సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.