కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ను గెలిపిస్తారని చెప్పారు.
సిద్దిపేట:కాంగ్రెస్, బీజేపీలు ఎన్నిట్రిక్కులు ప్లే చేసినా తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. మంగళవారంనాడు సిద్దిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
కేసీఆర్ ను తిట్టడం కొందరు నాయకులకు ఫ్యాషన్ గా మారిందన్నారు. కేసీఆర్ ను తిడితే పెద్ద నాయకులు అవుతామనే భ్రమలో ఉన్నారని విపక్షాలపై హరీష్ రావు విమర్శలు చేశారు. తెలంగాణపై కేసీఆర్ కు ఉన్న ప్రేమ మోడీకి ఉండదన్నారు. అదరగొడితే బెదరగొడితే భయపడే నాయకుడు కేసీఆర్ కాదన్నారు. కేసులకు కేసీఆర్ భయపడేది లేదన్నారు. ప్రశ్నిస్తే ఈడీ, ఐటీ కేసులు పెడుతున్నారని ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. తాను అనుకన్న లక్ష్యం వైపునకు కేసీఆర్ ముందుకు వెళ్లాడన్నారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలతో పోరాడి న చరిత్ర కేసీఆర్‌దని ఆయన గుర్తు చేశారు.. కేసీఆర్ తెలంగాణకు దారి దీపమని ఆయన పేర్కొన్నారు. దేశానికి కేసీఆర్ మార్గదర్శి అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సిద్దిపేటకు మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు. . త్వరలో రైలు కూడా వస్తుందని హరీష్ రావు చెప్పారు. ప్రతి ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ పథకాలు అందుతున్నాయన్నారు.
ఐదారు రాష్ట్రాలకు తిండిపెట్టే ధాన్యం తెలంగాణ రైతులుపండిస్తున్నారని హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతోనే రాష్ట్రంలో ధాన్యం విస్తీర్ణం పెరిగిందన్నారు.
రాష్ట్రంలోని ప్రాజెక్టులు, పథకాలను కేంద్ర మంత్రులు ఎన్నోసార్లు ప్రశంసించారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. రైతు బంధును కాపీ కొట్టి పీఎం కిసాన్ నిధిని కేంద్రం అమలు చేస్తుందన్నారు. ఈ నెల 30న అద్భుతమైన సచివాలయ భవనం ప్రారంభించుకుంటున్నామని ఆయన తెలిపారు.