అరెస్ట్ చేస్తే ప్రజల్లోకి వెళతా.. బీజేపీ అసలు టార్గెట్ నేను కాదు, కేసీఆరే : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై కవిత

Siva Kodati |  
Published : Mar 03, 2023, 09:48 PM IST
అరెస్ట్ చేస్తే ప్రజల్లోకి వెళతా.. బీజేపీ అసలు టార్గెట్ నేను కాదు, కేసీఆరే : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై కవిత

సారాంశం

బీజేపీ అసలు టార్గెట్ తాను కాదని సీఎం కేసీఆరేనన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును ఎదుర్కొంటానని ఆమె తేల్చిచెప్పారు. రూ.130 కోట్ల లంచం అనేది తనకు తెలియదన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  తన పాత్ర లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలుకు పంపిస్తే నేనేం చేస్తానంటూ ఆమె ప్రశ్నించారు. లిక్కర్ స్కాం కేసుకు తాను భయపడనని.. అరెస్ట్ చేస్తే ప్రజల దగ్గరకు వెళ్తానని కవిత తేల్చిచెప్పారు. తానేమి ఫోన్లు ధ్వంసం చేయలేదని.. సీబీఐ అడిగితే ఇస్తానని కవిత తెలిపారు. రూ.130 కోట్ల లంచం అనేది తనకు తెలియదని.. ఈ కేసును ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ఏపీలో బీఆర్ఎస్‌కు ఏ పార్టీ ఫేవర్ కాదని.. కేటీఆర్‌ను సీఎం చేయడానికే బీఆర్ఎస్‌ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కవిత ఖండించారు. 

లిక్కర్ స్కాంలో తాను చేసిందేమి లేదని.. ఆరుగంటలు  సీబీఐ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని ఆమె వెల్లడించారు. బీజేపీ అసలు టార్గెట్ తాను కాదని కేసీఆర్ అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛార్టెడ్ ఫ్లైట్‌లో వెళ్లి తాను ఏం చేశానో వాళ్లే చెప్పాలని చురకలంటించారు. బీఆర్ఎస్‌లో మిగిలిన లీడర్‌ల లాగే ఈ కేసులో కేసీఆర్ తనకు సలహాలు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. లిక్కర్ స్కాంలో విచారణకు సహకరిస్తానని.. ఈ కేసుకు సంబంధించి సీరియస్ ఆరోపణలు సరికాదన్నారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తానా లేదా అన్నది పార్టీ నిర్ణయిస్తుందన్నారు కవిత. కాంగ్రెస్‌తో పొత్తు అనేది అప్పటి పరిస్ధితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. పవన్‌కు బీఆర్ఎస్ వెయ్యి కోట్లు ఆఫర్ చేసిందనేది నిజం కాదని కవిత ఖండించారు. అలాగే బీజేపీ మేలు కోసమే బీఆర్ఎస్ పెట్టారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. 

ALso REad: బీజేపీ నేతలు చెప్పినట్టు అరెస్టులా? ఢిల్లీ లిక్కర్ స్కాంపై కవిత

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం లో  ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా ను  ఇటీవలనే  సీబీఐ అధికారులు అరెస్ట్  చేశారు. మనీష్ సిసోడియా తర్వాత  తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కూడా అరెస్ట్ అవుతారని  బీజేపీ  నేతలు  అంటున్నారు. బీజేపీ  నేతలు వివేక్ , బండి సంజయ్ కూడా పలుమార్లు కవిత అరెస్ట్ తప్పదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం చార్జీషీట్‌లో  కవిత  పేరును కూడా  ప్రస్తావించింది ఈడీ. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu